ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను..

తన చేతిలో పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ నాయకులు విజయసాయి రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని, తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు. పులివెందుల వేషాలు సాగనివ్వబోనని అన్నారు. చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికనేరాలు ఎలా చేయాలో చూపించిన విజయసాయిరెడ్డికి మాట్లాడే హక్కే లేదని చెప్పారు. సాయిరెడ్డి లాంటి వారి కోసమే తాము విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను నిల్చోబెట్టామని అన్నారు. దమ్ముంటే విశాఖకు వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగంటి బాబును గెలిపిస్తే, ఆయన లోక్ సభకు వెళ్లి నిద్రపోయారని, అందుకే ఆర్థికవేత్త పత్తిపాటి పుల్లారావును తాము కైకలూరు అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పారు.

సొంత పినతండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే, వారిని ఉతికి ఆరేశామని, మెడలు వంచి పని చేయించామని అన్నారు. పాదయాత్రలు చేసి జగన్ సాధించినదేంటీ అని ప్రశ్నించారు. ఏ సమస్య తీర్చమని అడిగినా ప్రతిపక్ష నేత తాము ముఖ్యమంత్రి అయ్యాక చేస్తానంటున్నారని, జనం ఎందుకు ఓటు వేయాలని అని అన్నారు. వార్డు మెంబర్ కూడా లేని జనసేన పార్టీ సమస్యల మీద పోరాటం చేసినట్టు ప్రతిపక్ష నేత ఎందుకు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Leave a Reply