ఎంపీ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 17 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. తెదేపా 5 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ తెదేపా అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 130కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైకాపా, 30 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.జనసేన పార్టీ ఎక్కడా ఖాతా తెరవలేదు.

Leave a Reply