ఎగ్జిట్‌పోల్స్‌: తెరాసకే అత్యధిక సీట్లు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశమంతా ఎగ్జిట్‌పోల్స్‌ హడావుడి మొదలైంది. అయితే, దేశంలోని అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణలో తెరాస అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గులాబీ పార్టీకి కనీసం 12 నుంచి గరిష్ఠంగా 16 స్థానాలు రావొచ్చని సర్వే సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని తెలిపాయి. ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్‌ మినహా మిగతా అన్ని సంస్థలు భాజపాకు తెలంగాణలో ఒక స్థానం దక్కుతుందని అంచనా వేశాయి.

తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్‌

సర్వే సంస్థలుతెరాసకాంగ్రెస్‌ఎంఐఎంభాజపా
ఆర్జీ ఫ్లాష్‌ టీం14-160-210
న్యూస్‌1812-141-211-2
ఎన్డీటీవీ12221
ఇండియా టుడే10-121-31-31
సీ ఓటర్‌14111
టైమ్స్‌ నౌ13211
టుడేస్‌ చాణక్య 12-161-21-21

 

Leave a Reply