ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో పలువురు మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ టీడీపీని చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది.

ఫ్యాన్ జోరుకు పలువురు మంత్రులు కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, అఖిలప్రియ, కిడారి శ్రావణ్, తమ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో వెనుకంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తుంటే వైసీపీ ఘనవిజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గాలి తీసేశారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

 

Leave a Reply