తెలంగాణలో పుంజుకున్న భాజపా, కాంగ్రెస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో 16 చోట్లా తమదే విజయమన్న తెరాసకు ఆ స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడం విశేషం. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఈ రెండు పార్టీలు కలిపి 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 8 చోట్ల అధికార తెరాస అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 4 స్థానాల్లో కాంగ్రెస్‌, 4 స్థానాల్లో భాజపా, ఏఐఎంఐఎం ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.

  • మెదక్‌ నియోజకవర్గంలో 9వ రౌండ్‌ ముగిసే సమయానికి తెరాస అభ్యర్థి 1.44లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • నాగర్‌ కర్నూల్‌లో తెరాస అభ్యర్థి రాములు ముందంజలో కొనసాగుతున్నారు.

  • కరీంనగర్‌లో 9వ రౌండ్‌ ముగిసే సరికి భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ 55వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • హైదరాబాద్‌లో ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ 85వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.

  • నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

  • సికింద్రబాద్‌లో భాజపా అభ్యర్థి కిషన్‌ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

  • మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి 3781 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

  • పెద్దపల్లిలో తెరాస అభ్యర్థి వెంకటేశ్‌ నేత ఆధిక్యంలో ఉన్నారు.

  • చేవెళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, తన సమీప తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితపై ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

  • ఖమ్మంలో తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు.

  • మెహబూబాబాద్‌లో తెరాస అభ్యర్థి కవిత మాలోతు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • జహీరాబాద్‌లో తెరాస అభ్యర్థి బీబీ పటేల్‌ ముందంజలో ఉన్నారు.

  • మహబూబ్‌నగర్‌లో తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

  • అదిలాబాద్‌లో భాజపా అభ్యర్థి సోయం బాపురావు ముందంజలో కొనసాగుతున్నారు.

  • వరంగల్‌లో తెరాస అభ్యర్థి దయాకర్‌ పసునూరి ఆధిక్యంలో ఉన్నారు.

Leave a Reply