పవన్‌.. రెండు చోట్లా వెనుకంజ

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు.మూడో రౌండ్‌ ముగిసేసరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్‌ మూడో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఇక్కడ వైకాపా ముందంజలో ఉండగా.. తెదేపా రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక పవన్‌ పోటీ చేసిన  మరో నియోజకవర్గం విశాఖ జిల్లా గాజువాకలోనూ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ ఐదో రౌండ్‌ ముగిసేసరికి.. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి.. పవన్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Leave a Reply