పులివెందులలో జగన్‌ ఘన విజయం

పులివెందుల: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఘన విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌పార్టీకి, వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ వైకాపా తరఫున గెలుపొందారు. 2014లో వైఎస్‌ జగన్‌ భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు. అదే ఘన విజయాన్ని 2019 ఎన్నికల్లోనూ కొనసాగించారు.

Leave a Reply