ప్రజా తీర్పు గొప్పదే: మోహన్‌బాబు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై సినీనటుడు, వైకాపా నేత మంచు మోహన్‌బాబు స్పందించారు. ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌ రెడ్డి తన కుమారుడికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా అందించారన్నారు. ‘‘3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. అందుకే ప్రజలు ఆశీస్సులు అందించారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్‌’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 145 స్థానాల్లో వైకాపా, 28 స్థానాల్లో తెదేపా, జనసేన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Leave a Reply