భీమవరంలో పవన్‌ వెనుకంజ..

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో పవన్‌ వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి పుంజుకున్నారు. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం. పవన్‌పై తెదేపా అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ వెలువడుతున్న ఫలితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా 146కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

Leave a Reply