మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

మెదక్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.

కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో భాజపా ముందంజలో ఉండగా.. మల్కాజ్‌గిరి, నల్గొండ, భువనగిరి, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది.

Leave a Reply