మోదీకి ఆ రికార్డు ఎలా సాధ్యమైంది..?

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక భాజపా అనూహ్యంగా పుంజుకోవడంతో భాజపా మేజిక్‌ మార్కును తేలిగ్గా చేరుకొంది. దీంతో సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న  నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.  అంతకు మందు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో పదవిలోకి తిరిగి వచ్చారు. తొలిసారి భాజపా తెలంగాణలో కూడా గణనీయంగా పుంజుకొవడం విశేషం. ఇక కర్ణాటకలో అయితే వార్‌ వన్‌సైడే అన్నట్లు పోరు జరుగుతోంది. రాష్ట్రంలో అధికార పక్షం రెండంకలను కూడా చేరుకోకపోవడం విశేషం. కీలకమైన హిందీ రాష్ట్రాల్లో భాజపా పట్టు నిలుపుకొంది.

మోదీకి వెన్ను దన్నుగా హిందీ రాష్ట్రాలు..

హిందీ ప్రధాన భాషగా ఉన్న రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోదీకి వెన్నుదన్నుగా నిలిచాయి. బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీలో భాజపా విశ్వరూపం చూపింది. కాకపోతే ఉత్తర ప్రదేశ్‌లో గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయి. కానీ అత్యధిక స్థానాలను మాత్రం భాజపానే సొంతం చేసుకొంది. బలమైన ఓటు బ్యాంక్‌లు ఉన్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు  కలిసినా భాజపాను అడ్డుకోలేకపోయాయంటే ఇక్కడ  భాజపా బలాన్ని అంచనా వేయవచ్చు. వీటిల్లో చాలా రాష్ట్రాల్లో భాజపా అధికారంలో లేదు. రాష్ట్ర ఎన్నికల్లో కుల సమీకరణలు బలంగా పనిచేశాయి. జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చేసరి కేవలం మోదీనే వారికి బలమైన ఎంపికగా కనిపించారు. దీంతో కమలం కళకళలాడింది. దీనికి తోడు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో బలపడింది. ఈ దీంతో  అక్కడి స్థానిక పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. తెలంగాణలో కూడా భాజపా గట్టిపోటీనే ఇచ్చింది. ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు విస్తరిస్తోందనడానికి ఇదే బలమైన సంకేతంగా నిలిచింది. ఇక జమ్ము కశ్మీర్‌లో కూడా తన పట్టును నిరూపించుకొంది. సొంతరాష్ట్రమైన గుజరాత్‌పై మోదీ పట్టు ఏమాత్రం సడలలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి.

ఇందిరతో పోలిక..

దేశ ప్రజలు మోదీని బలమైన నేతగా చేస్తున్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయి. గతంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టని ఇందిరాగాంధీ కూడా  అప్పట్లో పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా పార్టీలో , ప్రభుత్వంతో తిరుగులేని నేత. భారత జాతీయ రాజకీయాల్లో కూటములు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు నాలుగు సార్లు మాత్రమే పూర్తికాలం పాలించగలిగాయి. 2014లో భాజపాకు సొంతంగా మెజార్టీ వచ్చినా.. ఎన్‌డీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి కూడా పూర్తి స్థాయిలో సొంతంగా బలం సంపాదించుకొంది. దీంతో మోదీ చాలా స్వతంత్రంగా సాహసోపేతమైన నిర్ణయాలు  తీసుకొన్నారు. వీటిలో కొన్ని ప్రజలను ఇబ్బంది పెట్టినా.. ధైర్యవంతుడైన మొండి పాలకుడిగా మోదీ ఇమేజ్‌ పెరిగిపోయింది. సొంత బలం ఉన్నా.. కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  దీంతో పాలనపై మోదీకి తిరుగులేని పట్టు వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఈ వెసులుబాటు లభించలేదు.

Leave a Reply