మోదీ, జగన్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని కేసీఆర్‌ ఆకాంక్షించారు. జగన్‌కు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మీరు పడిన కష్టానికి ప్రజల ఆశీర్వాదం రూపంలో మంచి ఫలితం దక్కిందని కొనియాడారు.

Leave a Reply