Andhra Pradesh Election Results update 2019

12:24(IST)

తెలంగాణలో పుంజుకుంటున్న భాజపా, కాంగ్రెస్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లు పుంజుకుంటున్నాయి. చెరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

 

12:20(IST)

ఆధిక్యంలో బాలయ్య: హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రెండో రౌండ్‌ ముగిసే సరికి నందమూరి బాలకృష్ణ 3671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12:17(IST)

మూడో స్థానంలో పవన్‌: భీమవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ మూడో స్థానంలో ఉన్నారు. మూడో రౌండ్‌ ముగిసే సరికి మొదటి స్థానంలో వైకాపా, రెండో స్థానంలో తెదేపా ఉన్నాయి.

12:14(IST)

ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి: మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్‌ ముగిసే సరికి 3781 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

12:11(IST)

5వేల ఓట్ల ఆధిక్యంలో కొడాలి నాని: ఐదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి, గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి 5380 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12:10(IST)

మహారాష్ట్ర: కేంద్ర మాజీ మంత్రి, షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజలో ఉండగా, బారామతి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియ సూలే ముందంజలో ఉన్నారు.

12:07(IST)

ఏడో రౌండ్‌లో చంద్రబాబు ఆధిక్యం: కుప్పం శాసనసభా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఏడో రౌండ్ ముగిసే సరికి సీఎం చంద్రబాబు 6260 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12:03(IST)

పశ్చిమ్‌బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేవలం రెండు సీట్లు దక్కించుకున్న భాజపా ఇప్పుడు ఏకంగా 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

12:00(IST)

సాధ్వి ముందంజ: మధ్యప్రదేశ్‌ భోపాల్‌ భాజపా అభ్యర్థి, వివాదాస్పద వ్యాఖ్యల కేంద్ర బిందువు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ముందంజలో ఉన్నారు.

11:55(IST)

మంత్రి గంటా వెనుకంజ: విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైకాపా అభ్యర్థి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:51(IST)

ఈరోజు సాయంత్రం వైకాపా అధ్యక్షుడు జగన్‌ మీడియాతో మాట్లాడతారని ఆపార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. మరోపక్క ఏపీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలపై వైకాపా నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేతలు, కార్యకర్తలు తాడేపల్లిలో జగన్‌ నివాసానికి చేరుకుంటున్నారు.

 

Leave a Reply