ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను..

తన చేతిలో పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ నాయకులు విజయసాయి రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని, తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు. పులివెందుల వేషాలు సాగనివ్వబోనని అన్నారు. చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికనేరాలు ఎలా చేయాలో చూపించిన విజయసాయిరెడ్డికి మాట్లాడే హక్కే లేదని…