పులివెందులలో జగన్‌ ఘన విజయం

పులివెందుల: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఘన విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌పార్టీకి, వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌…

మోదీ, జగన్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం…

మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

మెదక్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం…

మోదీకి ఆ రికార్డు ఎలా సాధ్యమైంది..?

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక భాజపా అనూహ్యంగా పుంజుకోవడంతో భాజపా మేజిక్‌ మార్కును తేలిగ్గా చేరుకొంది. దీంతో సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న  నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.  అంతకు మందు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో పదవిలోకి తిరిగి వచ్చారు. తొలిసారి భాజపా తెలంగాణలో కూడా గణనీయంగా పుంజుకొవడం…

సంబరాల్లో వైకాపా‌.. జగన్‌కు అభినందనల వెల్లువ

అమరావతి: ఏపీలో వైకాపా దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తెదేపా చతికిలపడింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైకాపా 140కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా ఆధిక్యం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్రంలో వైకాపా హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను…

తెలంగాణలో 5 స్థానాల్లో భాజపా ఆధిక్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో 25 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఐదు స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 11గంటలకు వెలువడిన ఫలితాల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల…

భీమవరంలో పవన్‌ వెనుకంజ..

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో పవన్‌ వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి పుంజుకున్నారు. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం.…

KCR TRS

ఎగ్జిట్‌పోల్స్‌: తెరాసకే అత్యధిక సీట్లు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశమంతా ఎగ్జిట్‌పోల్స్‌ హడావుడి మొదలైంది. అయితే, దేశంలోని అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణలో తెరాస అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గులాబీ పార్టీకి కనీసం 12 నుంచి గరిష్ఠంగా 16 స్థానాలు రావొచ్చని సర్వే సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని…