YSRCP 149 Seats Leading: వైసీపీ ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి అవుతున్నాయి. ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో అన్న ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం పకడ్బంధీ ఏర్పాట్లు మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేశారు. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు. న్యూసువిధ యాప్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రతి రౌండ్‌కు ఫలితాలు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. మధ్యాహ్నం 12గంటలకు పార్టీల గెలుపోటముల సరళి తెలుస్తుందన్నారు.

AP LoK Sabha Results Live Updates: ఏపీ లోక్‌సభ ఫలితాలు.. గెలిచేదెవరు!

లైవ్ అప్‌డేట్స్

✦ వైసీపీ ఆధిక్యం రౌండ్ రౌండ్‌కి పెరిగిపోతోంది. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ 149 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ కేవలం 24 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

✦ వైసీపీ ఆధిక్యం రౌండ్ రౌండ్‌కి పెరిగిపోతోంది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ 145 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ కేవలం 29 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

✦ వైసీపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీఎం సొంత జిల్లాలోనూ 8 స్థానాల్లో జగన్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కుప్పంలో తొలి రౌండ్లో వెనుకంజలో ఉన్న సీఎం చంద్రబాబు రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వెళ్లారు. విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాస రావు వెనుకంజలో ఉన్నారు.

 ఏపీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. 87 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుండగా.. 17 చోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి.

 87 స్థానాల్లో వైసీపీ, 17 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన పార్టీ ముందుంజలో ఉన్నాయి. నందిగామలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. హిందూపురంలో బాలయ్య ముందంజలో ఉన్నారు.

✦ 60 స్థానాల్లో వైసీపీ, 17 స్థానాల్లో టీడీపీ ముందుంజలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ లీడ్‌లో ఉంది.

✦ నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్‌లో ఉన్నారు.

✦ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వర ప్రసాద్ ముందంజలో ఉన్నారు.

✦ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో లెక్కింపు ముగిసే సరికి పవన్‌పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 625 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

✦ రంప చోడవరం, అరకు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రంప చోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, అరకు నుంచి చెట్టి పల్గుణ లీడ్‌లో ఉన్నారు.

✦ బద్వేలులో వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య 1313 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలిచింది. ఈసారి కూడా అదే హవా కొనసాగే అవకాశముంది.

✦ పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లీడ్‌లో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి జగన్ 2003 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.

✦ మంగళగరి నియోజకవర్గంలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేసరికి లోకేష్ లీడ్‌లోకి వచ్చారు.

✦ మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ ముందంజలో ఉంది. తొలి రౌండ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 1651 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.

✦ ఎచ్చెర్ల, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ ముందంజలో ఉన్నారు.

✦ కచ్చితంగా మనం గెలుస్తున్నాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదంటున్నారు చంద్రబాబు. 110 స్థానాలకు పైగా సాధిస్తామని నేతలతో చెబుతున్నారు. లెక్కింపు ముగిసేవరకు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలని పార్టీ నేతలు, ఏజెంట్లకు చంద్రబాబు సూచించారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

✦ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

✦ ప్రస్తుతం అందరి దృష్టి గాజువాకపై ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శాసనసభకు పోటీపడుతుండటమే దీనికి కారణం. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పవన్ పోటీ పడుతున్నారు.

✦ కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతుందా?
ఎన్నికల ఫలితాల వేళ.. టీడీపీ అధినేత వరసగా ఏడోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్న కుప్పం నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఆయన ఈసారి తన మెజార్టీని పెంచుకుంటారా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆధిక్యం తగ్గుతుందా? చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న టీడీపీ రాష్ట్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందా? అనేవి చర్చనీయాంశాలుగా మారాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

✦ ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి.

✦ వైసీపీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరోవైపు టీడీపీకి 90 నుంచి 100 వస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే చెబుతోంది.

✦ ఏపీలో అధికారం ఎవరిదనే విషయంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రజలను కాస్త తికమకకు గురిచేశాయి. కొన్ని సర్వేలు టీడీపీ మళ్లీ ఎన్నికవ్వబోతోందని చెబితే.. మరికొన్ని వైసీపీ గెలుస్తుందని స్పష్టం చేశాయి.

✦ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో బుధవారం విధులకు హాజరైన పలువురు సిబ్బంది, పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్‌ కళాశాల లెక్కింపు కేంద్రం ప్రధాన ద్వారం కిటికీలకు ఆనుకుని ఉన్న తేనెటీగల పట్టు కదిలి అక్కడ ఉన్న సిబ్బందిని పరుగులు తీయించాయి.

✦ లెక్కింపు కేంద్రాల వద్ద 15 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెల్లడించారు.

✦ ఫలితాల లెక్కింపులో వీవీప్యాట్‌ స్లిప్పులు ఫారం 17సీతో సరిపోవాలి. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక సమస్య ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్లు లెక్కిస్తాం: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది తెలిపారు.

✦ మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమలు
మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటిగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నర్ణయమని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

Leave a Reply